![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -420లో.. ముకుంద ఇంత పిచ్చి పని చేస్తుందని అనుకోలేదని కృష్ణ అంటుంది. ఇదంతా నీ పుణ్యమే కదా అని ఆదర్శ్ అంటాడు. ఎక్కడ ముకుందని అలా వదిలేస్తే మళ్ళీ మురారి వెంట పడుతుందోనని నన్ను తీసుకొని వచ్చి మమ్మల్ని బలవంతంగా దగ్గర చెయ్యాలని చూసారు. అప్పుడు మమ్మల్ని దూరంగా పంపించేసి మీరు హ్యాపీగా ఉండాలని ప్లాన్ చేశారని ఆదర్శ్ అంటాడు. ఆదర్శ్ అనే మాటలకి కృష్ణ ఏడుస్తుంటుంది.
ఆ తర్వాత ఇంట్లో కృష్ణ గురించి ఎవరు చెప్పినా ఆదర్శ్ వినే సిచువేషన్ లో లేడు. మరొకవైపు ముకుంద తన నాన్న శ్రీనివాస్ ని తీసుకొని వేరొక ఇంటికి వస్తుంది. అక్కడ ఉంటే నీ దగ్గరికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. అప్పుడు వాళ్ళు నన్ను చూస్తే ఇదంతా చేసి వేస్ట్ అవుతుంది. అందుకే కొన్ని రోజులు దూరంగా ఉండాలని ముకుంద అంటుంది. ఇప్పటికే నువు ఉన్నా లేవనే సిచువేషన్ వచ్చింది. ఇక ఇవన్నీ మనకు వద్దని శ్రీనివాస్ అంటాడు. నిన్న నాకు సపోర్ట్ చేస్తానని అన్నావ్ కదా.. మురారిపై ఎంత ప్రేమ ఉందో కృష్ణపై అంతే పగ ఉందని ముకుంద అంటుంది. ఆ తర్వాత ముకుంద కావాలనే మురారికి కన్పించాలని వస్తుంది. ఇంట్లో ఉన్న మురారికి ముకుంద బయట కన్పిస్తుంది. ముకుందని చూసి మురారి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ లోపే ముకుంద వెళ్తుంది.. మురారి అంత చూస్తూ ఇదంతా నా భ్రమ అని తిరిగి లోపలికి వెళ్తాడు. నాకు కావలసింది కూడా ఇదే నేను బ్రతికి ఉన్నపుడు నాతో బతకాలి నేను పక్కన లేనప్పుడు నా భ్రమలో బ్రతకాలని ముకుంద అనుకుంటుంది.
ఆ తర్వాత రేవతి, కృష్ణలకి కన్పించకుండా ముకుంద తప్పించుకుంటుంది. నేను ఏమైనా తప్పు చేసానా అని మురారి ఆలోచిస్తుంటాడు. అన్ని రకాలుగా ముకుందని రిక్వెస్ట్ చేసానని మురారి అనుకుంటాడు. తరువాయి భాగంలో కృష్ణని ఆదర్శ్ తిడుతుంటే మురారి అడ్డుపడతాడు. ఆ తర్వాత ఇద్దరికి గొడవ జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |